శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఆదేశాలు మేరకు మా జగనన్న. మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సచివాలయ కన్వీనర్లు గృహసారదులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సోమందేపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నందు గల సచివాలయ కన్వీనర్లుకు, గృహసారధులకు మండల ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యక్రమాన్ని గురించి వివరించారు. సచివాలయ కన్వీనర్లకు మరియు గృహసారధులకు సూచిస్తూ ప్రతి సచివాలయ కన్వీనర్ మరియు గృహ సారధి ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి వారికి మన జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి తెలిపి మరియు వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రతి ఇంటి దగ్గర పది నిమిషాలు గడపాలని వారి దగ్గర నుండి 8296082960 మిస్సేడ్ కాల్ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి, శ్రీసత్య సాయి జిల్లా వైయస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, సోమందేపల్లి మండల కన్వీనర్ తుంగోడు నారాయణరెడ్డి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, గారు, మండల సచివాలయాల కన్వీనర్ షేక్ ఇమామ్ వలి, వైయస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.