బాపట్ల జిల్లా కలెక్టర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన విజయ్ కృష్ణనన్ బదిలీ సామాన్య ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో పాలనపై ఆమె తనదైన మార్కును సంపాదించారు. విజయ కృష్ణనన్ చొరవతోనే నియోజకవర్గంలో జగనన్న ఇంటి నిర్మాణాలు కొన్ని పూర్తిగా, మరి కొన్ని నిర్మాణ దశకు చేరుకున్నాయి. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో కలవటం, అద్దంకి నియోజకవర్గం చివరగా ఉండటంతో ఆమె ఎక్కువగా అద్దంకి నియోజకవర్గం లోని సమస్యల పైనే దృష్టి సారించారు. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆమె పూర్తి స్థాయిలో విజయం సాధించారు. నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిసారి సామాన్య ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి ఆమె వారి మన్నలను అందుకున్నారు. బాపట్ల జిల్లా ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఆమె బదిలీ అవటం అద్దంకి నియోజకవర్గంలోని సామాన్య ప్రజానీకానికి అసంతృప్తిని మిగిల్చింది.