విద్యార్థి దశ నుండే ప్రతిఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని శ్రీ చక్ర పాఠశాల చైర్ పర్సన్ ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ప్రొద్దుటూరు స్థానిక ధర్మల్ రోడ్డు లోని విశ్వ ప్రేమ వృద్ధాశ్రమంలో జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమంలో భాగంగా శ్రీ చక్ర పాఠశాల విద్యార్థులు వృద్ధాశ్రమాన్ని సందర్శించి, వృద్దులతో సరదాగా గడిపారు. పిల్లల చేతుల మీదుగా భోజనం ఏర్పాటు చేశారు. చిన్నారులు అందజేసిన రూ. 21 , 930 నగదు , నిత్యావసర వస్తువులను, పండ్లను వృద్దులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, వృద్దాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.