నెల్లూరు జిల్లాలో శుక్రవారం జరుగుతున్న సమీక్ష సమావేశం లో రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో సభా వేదిక వద్ద సిద్ధవటం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అధ్యక్షతన సిద్ధవటం మండల తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్లు హాజరయ్యారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, సమీక్షా సమావేశాలలో ఎల్లప్పుడూ పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు.