జగనన్న ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మైలవరం మండల పరిధిలోని కర్మల వారి పల్లె గ్రామంలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. రానున్న రోజులలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తనకు బాసటగా నిలవాలని ఆయన ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.