రైతులు రబీలో పండించే పంటల వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు శిమ్మ నేతాజీ సూచించారు. గురువారం నరసన్నపేట మండలం మాకివలసలో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ పంట నమోదు చేసుకోవడం వలన ఎటువంటి పంట నష్టాలు కలిగిన ప్రభుత్వం ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రతి రైతు భరోసా కేంద్రాలలో రైతులు వెళ్లి నమోదు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏవో సునీత, ఎంపీటీసీ యాళ్ల అప్పలనాయుడు, సర్పంచులు రావాడ మోహనరావు, రువ్వ బోడి రామన్న, పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.