నరసన్నపేట మండలం లుకలాం గ్రామపంచాయతీలో గురువారం ఉర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైఎస్ఆర్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫ్యామిలీ పిజిషన్ కాన్సెప్ట్ ను లుకలాం సచివాలయంలో సర్పంచ్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా డాక్టర్ అరవింద్ కోరారు. నెలలో రెండు రోజులు డాక్టర్లు పర్యవేక్షణ చేస్తారని అత్యవసరకేసులని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిఫారసు చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పీ హెచ్ ఈ ఓ గణపతి రావు, ఏఎన్ఎంలు మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.