ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో గల స్థానిక సచివాలయం 1లో 170వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కడప గడపకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి విపులంగా వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజల కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.