అరకులోయ మండలంలోని ఇరగాయి పంచాయతీలో గురువారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇరగాయి పంచాయతీకి గతంలో పనిచేసిన టిడిగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గడబంటు అర్జున్ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. సర్పంచ్ మృతితో తన స్వగ్రామమైన టిడిగూడలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు సర్పంచ్ గతంలో ఇరగాయి పంచాయతీకి సర్పంచ్ గా చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గ్రామస్తులు తెలిపారు. మృతుడు సర్పంచ్ కి దహన సంస్కరణలు మధ్యాహ్న సమయంలో నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.