పోలవరం ఎత్తు, 135 అడుగుల ఎత్తుకు తగ్గించటం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అన్ని పార్టీల నేతలు, నాయకులూ మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి శాలువాలు కప్పి వస్తున్నారే తప్ప ఏపీకీ న్యాయం చేయటం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు సుమారు 300 మంది వరకు మృతి చెందారని చలసాని శ్రీనివాస్ అన్నారు. కృషి బ్యాంక్, అగ్రిగోల్డ్‌లు మూసివేస్తే సామాజిక వర్గాల వారు యాజమాన్యానికి మద్దతు ఇచ్చారని, పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసుల భయంతో కేంద్రానికి భయపడుతున్నారని, ఎంపీలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంతో రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. అగ్రిగోల్డ్, పోలవరంపై ఉండవల్లి వస్తే కలిసి పోరాడదామని చలసాని శ్రీనివాస్ అన్నారు.