విజయనగరం లో శుక్రవారం నాడు క్రీస్తు మరణ స్మరణ దినోత్సవం సందర్భంగా కతొలిక్ చర్చ్ భక్తులు చర్చిఫాథర్ లూర్డ్ అద్వర్యంలో స్థానిక పురవీధుల్లో క్రీస్తుని స్మరిస్తూ శాంతియుత యాత్రా 2కిలోమీటర్ల మేర నిర్వహించారు. ఈ సందర్భంగా లూర్డ్ ఫాథర్ మాట్లాడుతూ అందరూ సత్యమునకు సాక్షులుగా ఉండాలన్నారు, మానవాళి పాపాపరిహారార్దమ్ యేసు క్రీస్తు యూదులకు అప్పగింపబడి , అన్యాయమూగా పిలాతుడు వేసిన మరణ శిక్షను క్రీస్తు అంగీకరించారన్నారు.మానవులు పాపాల భారాన్ని సిలువలో మోశారన్నారు.ముడ్లకిరటం, కొరడా దెబ్బలు, అవమానకర శ్రమలనభవించారన్నారు. అందరూ శాంతి సమాధానంతో సోదరి బావం కలిగి నిస్వార్థంగా జీవించాలని, ఇది మనకు మన పిల్లలకు భావితరాలకు క్రీస్తు ఇచ్చిన సందేశం అన్నారు. ఈ కార్యక్రమంలో స్దానిక భక్తులు, ప్రముకలు తోపాటు స్ధానిక ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కూడా తమ సేవాలందించారని లుర్డు ఫాథర్ తెలిపారు.