ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని గొలుగొండ జడ్పీటీ బాబు పేర్కొన్నారు. చీడిగుమ్మల గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పునరుద్ధరించి సుమారు 30 వ్యాధుల నివారణ చేసేలా అవకాశం కల్పించారని పేర్కొన్నారు.