నర్సీపట్నంలో వాహనదారుల ట్రాఫిక్ నిబంధనలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. డిజిటల్ విధానంలో చలానాలు ఇస్తూ వాహనదారులకు అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో టౌన్ ఎస్ఐ ధనుంజయ నాయుడు గురువారం రోడ్డు పక్కన ఇష్టానుసారం వాహనాలు నిలిపి ట్రాఫిక్ ఆటంకం కలిగించిన సందర్భంలో ఫోన్ ద్వారా వాహనం నెంబర్ ప్లేట్ కు ఫోటో తీసి ఈ చలానా ద్వారా జరినామా విధించారు. విధించిన జరినామా మొత్తం ఈ సేవ కేంద్రాలలో కట్టవలసి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa