ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ సర్పంచ్‌లకు శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:09 PM

గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది.జనవరి 5వ తేదీన గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల ఆధారంగా ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను మెజర్‌మెంట్ పుస్తకాలలో నమోదు చేసి ఉంటే, ఆ బిల్లులను చెల్లించవచ్చని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa