ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిషేక్ శర్మ ఒత్తిడి వలనే మంచి ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:07 PM

టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ డకౌట్ అవ్వడంతో, ఈ టోర్నీలో అతను వరుసగా మూడోసారి సున్నాకే పెవిలియన్ చేరినట్టయింది. అంచనాల భారమే 25 ఏళ్ల అభిషేక్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని, అతను భారీ షాట్ల కోసం తొందరపడకుండా క్రీజులో సమయం గడపడంపై దృష్టి పెట్టాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. "అభిషేక్ మంచి ఆటగాడే, కానీ అంచనాలు అతనిపై భారం మోపుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి బంతికే బౌండరీ లేదా సిక్స్ కొట్టాలని ప్రయత్నించకూడదు. భారీ షాట్లు వాటంతట అవే వస్తాయి కానీ, బలవంతంగా ఆడకూడదు" అని విశ్లేషించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa