ఏపీలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సీపీగా త్రివిక్రమ వర్మ, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్, కాకినాడ ఎస్పీగా ఎస్. సతీష్ కుమార్, తు.గో. ఎస్పీగా సుధీర్ కుమార్, అంబేద్కర్ జిల్లా ఎస్పీగా పి. శ్రీధర్, ఏలూరు ఎస్పీగా మేరీ ప్రశాంతి, అనంతపురం ఎస్పీగా కె.శ్రీనివాసరావు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా గంగాధర్ రావు, కర్నూలు జిల్లా ఎస్పీగా జి.కృష్ణకాంత్ లను నియమించింది.