ఓసీ మహిళల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 12న ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఇవాళ సమావేశం నిర్వహించనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఏటా రూ.15వేలు అందిస్తారు.