డీఎస్సీ-98లో అర్హత సాధించిన 4,072 మందికి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఆదేశాలు పేర్కొంది. 60ఏళ్లలోపు వారికి మాత్రమే పోస్టింగులు ఇవ్వాలని, బీఈడీ అర్హతతో నియామకాలు పొందినవారు ఏడాదిలోపు ఆర్నెళ్లలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలనే నిబంధన విధించారు.