పశ్చిమబెంగాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూచ్ బెహర్కు చెందిన విభూతి భూషణ్, ఇతి బర్మన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. కక్ష పెంచుకున్న భూషణ్, గురువారం రాత్రి తన ఇద్దరు మిత్రులతో కలిసి ఇతి కుటుంబంపై కత్తులతో దాడి చేశాడు. దాడిలో యువతి తల్లి, తండ్రి, సోదరి మరణించారు. తీవ్రగాయాలపాలైన యువతి పరిస్థితి విషమంగా ఉంది.