అదానీ గ్రూపులపై హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అదానీపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీలకు షాకిచ్చారు. అదానీపై హిండెన్ బర్గ్ నివేదిక ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పార్టీ పరంగా ఎన్సీపీకి మరో అభిప్రాయం ఉండొచ్చని పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు.