యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫరెండా తహసీల్ ప్రాంతానికి చెందిన మైరాహ్వా గ్రామంలో గోధుమ పంటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో 60 ఏకరాల గోధుమ పంట అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో రైతుల పంటలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినా సమయానికి రాలేదని రైతులు ఆరోపించారు. రెవిన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంటనష్టాన్ని అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa