దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొత్త కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొత్త వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలను గుర్తించినట్లు పిల్లల వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో అధిక జ్వరం, దగ్గు, జలుబుతోపాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి కొత్త లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించారు.