దాచేపల్లి మండలంకి చెందిన విద్యాసాగర్ కు ఆలేటి మేఘనతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే వివాహిత తో పెళ్లైన నాటి నుండి పరాయి మహిళలతో చనువుగా ఉండటం, అధిక కట్నం కావాలంటూ ఇంట్లో భర్త, అత్త, మామ, ఆడపడుచులు మానసికంగా వేధిస్తున్నారు. ఈనెల 4న మద్యం సేవించి మేఘన ను భర్త కర్రతో బజార్లో కొట్టాడు. దీంట్లో అవమానం తాళలేక వివాహిత శుక్రవారం రాత్రి చీర కొంగుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.