గుంటూరు: నగరపాలక సంస్థ ఆస్తిపన్ను గత ఏడాది 93. 67 కోట్లు కాగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం100. 36 కోట్లుగా నిర్ధారించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 6. 69 కోట్లు ప్రజలపై భారం పడనుంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, మూడు జిల్లాలలో కలిపి 14 పురపాలక సంఘాలు ఉన్నాయి. వాటన్నిటిలో కలిపి చూస్తే మరో మూడు కోట్లు దాకా అదనంగా ఉండొచ్చు అని అధికారులు అంటున్నారు.