గుంటూరు పట్టణంలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటుగా సెలవు రోజుల్లోనూ నగదు కౌంటర్లు పనిచేస్తాయని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శని, ఆదివారాల్లో ఉదయం 8: 00 నుంచి రాత్రి 8: 00 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏక మొత్తంలో పన్ను చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆస్తి ఖాళీ స్థలం పన్ను ఆన్లైన్లో అప్డేట్ చేసినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa