చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామం సచివాలయం 2 పరిధిలో శుక్రవారం రాత్రి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాల బుక్ లెట్ చూపిస్తూ ప్రజలకు వివరించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా చూస్తున్న మేరకు మాలో విశ్వాసం పెరిగిందని గ్రామస్తులు ఎమ్మెల్యే కిలారికి తెలిపారు. గ్రామ సచివాలయం నిధుల ద్వారా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కిలారి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, వైసీపీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.