ఆర్డీటి సంస్థ చేపట్టిన స్పందించు సాయం అందించు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి రూ. 2, 50, 000 విరాళంగా అందజేశారు. పేద ప్రజలకు సహయం చేయడం లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ డి టి) సంస్థ చేసున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, చిదానంద, క్రిష్ణ, నాగేష్, ఏరిగేరి విరేష్, డేవిడ్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.