పేకాట స్థావరంపై రేపల్లె పట్టణ పోలీసులు దాడి నిర్వహించారు. రేపల్లె పట్టణ సీఐ విజయ్ చంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది రేపల్లె మండలం లోని రావి అనంతపురం గ్రామంలో శుక్రవారం రాత్రి దాడి చేశారు పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10, 100 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.