ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధి అజంతా పార్క్ వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన వ్యక్తి వివరాలను ఎయిర్ పోర్టు పోలీసులు గుర్తించారు. ఈమెరకు శుక్రవారం ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెష్ట్ బెంగాల్ కు చెందిన చుర్కాతుడు కుటుంబ సభ్యులతో మాల్డా స్టేషన్లో ఈ నెల 3న దిబ్రుగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ ఎక్కారు. మృతుడు చుర్కా తుడు మతిస్తిమితం లేదు, మధ్యం సేవించి ఉండడంతో 4న రాత్రి 8. 30 సమయంలో అజంతాపార్క్ వద్దకు వచ్చే సరికి దూకేందుకు యత్నించారు. డోర్ దగ్గర ఉన్న వారు వారించినా ఆగకుండా దూకేశాడు. మృతుని భార్య కు ఎక్క దూకాడో ఏంమి జరిగిందో అర్ధంకాక సికింద్రాబాద్ వెల్లి పోయింది. మృతుని వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ద్వారా మృతునికి సంబందించిన వారికి సమాచారమివ్వడంతో శుక్రవారం మృతుని భార్య సోలాని మర్ధి రావడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. వీరు సికిద్రాబాద్ లో డైలీ కూలిగా పని చేస్తుంటారు. కూలీ పనుల కోసం వెల్తున్న సమయంలో ఈఘటన చోటు చేసుకుంది. మృత దేహాన్ని మృతుని బందువులకు అప్పగించారు.