రెండో రోజు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన వైసీపీ నాయకులూ మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. టీడీపీ సర్కార్కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైయస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్ జగన్ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు అని తెలియజేసారు.