కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిని గర్భవతిని చేసిన దారుణ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. గాజువాక మండలం గంగవరంలో పదవ తరగతి చదువుతున్న కూతురిపై తండ్రి మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa