చాలామంది ఇంటి చుట్టూ మొక్కలు పెంచేందుకు ఇష్టపడతారు. అయితే, వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు పెంచితే ఇంట్లో అశాంతి నెలకొంటుందని పండితులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో రేగు, మర్రి, రావి చెట్లు ఉండకూడదు. అలా ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయంటున్నారు. ఒక వేళ రావి చెట్టు ఆవరణలో ఉంటే రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. అలాగే, పాక చెట్టు, ఖర్జూర, జాక్ ఫ్రూట్ చెట్లను నాటవద్దని సూచిస్తున్నారు.