వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళిత అధికారులకు రక్షణ కరువైందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడపలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక జిల్లా స్థాయి అధికారి హత్యకు గురైతే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించాల్సిన అధికారులు చేతులెత్తేశారని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.