గంజాయి అక్రమ తరలింపు కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితుల్లో ఓ నిందితుడు బేడీలతో పాటుగా పరార్ అయిన ఘటన నగరంలో అందర్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీంతో సంబంధిత స్టేషన్ సిబ్బంది ఉరుకులు పరుగులతో నగరంలో కొన్ని కీలక ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారని సమాచారం. శుక్రవారం సాయంత్రం సంబంధిత నాల్గోపట్టణ పోలీసు స్టేషన్లో నిందితులకు సంబంధించిన అన్ని అంశాలతో ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు.
శనివారం మధ్యాహ్నం కోర్టుకి తరలించాలనిఅనుకున్న సమయంలో ఇలా జరగడంతోచెమటలు పట్టించారు. నిందితులు ఇద్దరూ పరారవ్వడానికి ముందే పథకం వేసుకున్నట్టు అందులో ఒకడి చేతికి బేడీలుఉంటుండగానే శనివారం తెల్లవారు జామున సుమారు 6. 45 గంటల సమయంలో స్టేషన్ నుంచి పరార్ అయిపోయాడు. నిందితుడు బయటకు వచ్చి వచ్చిన వెంటనే హైవేకి సమీపంలో ఉన్న మందల కాలనీలోకి చొరబడ్డాడని సంబంధిత సిబ్బంది నిందితుడి వెంట పరుగులు పెట్టారు. దీంతో సమీపంలో స్థానికులు ఎరుపు రంగు టీషర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్ వేసుకున్న ఓ యువకుడు అటుగా వెళ్లినట్టు సమాచారం సైతం ఇస్తున్నారు.
నిందితుల్లో అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, చిన్న పాచిల గ్రామానికి చెందిన పప్పు నూకరాజు(27), చోడవరం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన సియాదుల సత్తిబాబు(24) గా పోలీసులు గుర్తించారు. నిందితులు ఇరువురు మత్తును కలిగించే (ద్రవ పదర్థంలో ఉన్న గంజాయి) లిక్విడ్ గంజాయిని విక్రయించే క్రమంలో 4 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తూ రైల్వేస్టేషన్ సమీప బస్సెల్టర్ వద్ద ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు నగర టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిందితులను పట్టుకున్నట్టు సమాచారం. దింతో సంబంధిత సిబ్బంది స్థానిక నాల్గోవపట్టణ పోలీసు స్టేషన్కి అప్పగించగా ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేసి కోర్టుకి తరలించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.