భీమిలి నియోజకవర్గ 7వ వార్డు లో అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున రావు ముఖ్య అతిథిగా 3వ విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా మొదటిగా 7వ వార్డు స్వాతంత్ర్య నగర్ లో లక్ష్మీదేవి ఆలయం నుంచి వరదనీటి కాలువ నిర్మాణం చేయుట కోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా విలువ రూ. 19. 98 లక్షలు తో అవంతి చేతులు మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. డ్వాక్రా సంఘం వారు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటంతో ఉన్న నవరత్నాలు రంగవల్లిక ముగ్గును తిలకించిన అవంతి ఆకర్షణీయంగా ఆకట్టుకుందని కితాబు ఇచ్చారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజన్న కలలు కన్న స్వరాజ్యం జగనన్న తోనే సాద్యం అనేలా నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఉందని, దానికి నిదర్శనమే గ్రామాల్లో విద్య ఆరోగ్యం స్వయం ఉపాధి ఇలా పలు సంక్షేమ పథకాలు అమలు అని గత ప్రభుత్వాలు మహిళలను కేవలం ఓటు బ్యాంకు గానే చూసాయి గాని వారికి ఏకోనాన ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, రాజ్యాంగంలో రాసిన విదంగా మహిళలకు చట్టసభల్లో స్థానిక సంస్థలలో నామినేట్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేసారని, అంతేకాక వైయస్సార్ ఆసరా జగనన్న చేయుత జగనన్న తోడు లాంటి పథకాలు అందించి మహిళలు కూడా స్వతంత్రం గా ఎదిగేలా చేసి మహిళా సాధికారత జగనన్న తోనే సాద్యం అనేలా చేసి చూపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ,డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఘనత ఆయనదే అని, మహిళలు అంతా ఏకమై రాబోయే 2024 ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి గా జగనన్న నే గెలిపించాలని కోరారు.
అనంతరం 5-6-7- 8 వార్డు లో ఉన్న స్వయం సహాయక సంఘాలలో 13, 935 మంది లబ్దిదారులకు గానూ 10 కోట్ల 62 కోట్లు రూ చెక్కును అవంతి చేతులు మీదుగా అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున రావు జోనల్ కమిషనర్ కనక మహా లక్ష్మి ప్రభుత్వ అధికారులు వార్డు కార్పోరేటర్ లు వార్డు ప్రెసిడెంట్ లు ఆయా పదవుల్లో ఉన్న వారు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు లబ్థిదారులు పాల్గొన్నారు