యూపీలోని గాజీపూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బిజారా గ్రామంలో అజిత్ యాదవ్, నీతూ దంపతులకు పారీ,హ్యాపీ(6), హార్థిక్(10 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. అజిత్ యాదవ్ జమ్మూలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి పిల్లలపై నీతూ కత్తితో దాడి చేసింది. కుమారులు ఇద్దరి తలలు నరికేయగా, కుమార్తె పారీ ప్రాణాలతో బయటపడింది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.