పదవ తరగతి పరీక్షల్లో తెలుగుకు బదులు కాంపోజిట్ తెలుగు పేపర్ రాసిన విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అనంతపురం జిల్లా సహా పలుచోట్ల ఇన్విజిలేటర్ల తప్పిదంతో తెలుగు పేపర్ కు బదులుగా కాంపోజిట్ తెలుగు పేపర్ ఇవ్వగా, 70 మార్కులను 100 మార్కులకు లెక్కిస్తారు. దీంతో ఈ పరీక్ష రాసినవారు ఈనెల 17న 30 మార్కుల పరీక్ష రాయాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.