హృద్రోగాలు, క్యాన్సర్ వల్ల ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని నిరోధించే వ్యాక్సిన్లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. క్యాన్సర్‌తో పాటు హృద్రోగాలు, ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లకు చెక్ పెట్టగలిగే ఈ వ్యాక్సిన్లు 2030 లోగా సిద్ధమవుతాయని నిపుణులు చెప్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీ మోడెర్నా ప్రస్తుతం వివిధ రకాల కణుతులను టార్గెట్ చేసే క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తుంది.