ఎండుద్రాక్షలో ఉపయోగకరమైన కరిగే ఫైబర్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచటంలో, క్రమబద్ధతను ప్రోత్సహించటంలో సహాయపడుతుంది. ఎర్ర రక్తకణాలను తయారు చేయడానికి, శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకెళ్లాడానికి అవసరమైన ఐరన్, కాపర్, విటమిన్లు ఎండు ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. ఎండు ద్రాక్షలోని ఐరన్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు.. కడుపులోని ఆమ్లత స్థాయిలను సమతుల్యం చేయటంలో సహాయపడతాయి.