రాజస్థాన్ లోని బాడ్మేర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల తల్లైన దళిత మహిళపై షకూర్ ఖాన్ అనే వ్యక్తి ఆమె ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెపై రసాయనం పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె జోధ్ పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై సీఎం అశోక్ గహ్లోత్ పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.