రిలయన్స్ రిటైల్ సొంతంగా ఐస్‌క్రీం బ్రాండ్‌ను ఆవిష్కరించనుందని సమాచారం. ఇప్పటికే కూల్‌డ్రింక్స్, సబ్బులు, గృహ సంరక్షణ ఉత్పత్తుల్లో సొంత బ్రాండ్లను ఆవిష్కరించిన రిలయన్స్, ఇప్పుడు ఐస్‌క్రీం తయారీ కోసం ఈ రంగంలోని ఒక గుజరాతీ కంపెనీతో చర్చలు జరుపుతోందని సమాచారం. అన్నీ అనుకూలిస్తే, ఈ వేసవిలోనే రిలయన్స్ తన సొంత బ్రాండ్‌పై ఐస్‌క్రీమ్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి.