ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా ఏఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు మృతి

international |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 03:46 PM

ఏఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు క్వెంటిన్ గ్రిఫిత్స్ థాయ్‌లాండ్‌లో ఓ అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. పట్టాయాలోని అపార్ట్ మెంట్ నుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడి మృతి చెందారు. పోలీసులు, మెడికల్ సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు వచ్చి చూసేసరికి ఆయన నేలపై విగతజీవుడిలా కనిపించారు.ఆయన మరణానికి ముందు అపార్ట్ మెంట్‌లో ఎలాంటి ఘర్షణ లేదా గందరగోళ వాతావరణం కనిపించలేదని అధికారులు వెల్లడించారు. అయితే కుట్ర కోణాన్ని వారు తోసిపుచ్చలేదు. పోస్టుమార్టం నివేదిక అనంతరం ఆయన మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa