దేశవ్యాప్తంగా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాబోయే ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగన్నాయని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయువ్యంలోని కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలో వడగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.