గుత్తి పట్టణంలోని పురాతన కాలం నాటి గుత్తి కోటను పర్యాటక శాఖ అభివృద్ధి చేసి కోటపై తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని గుత్తి కోట పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం గుత్తి పట్టణంలోని ఏపి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థు లకు గుత్తి కోట గురించి అవగాహన కల్పించారు. కోటలోని ఉన్న చారిత్రా త్మక కట్టడాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులు ఎక్కువగా రావడానికి కోటపైకి రోప్వే ఏర్పాటు చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటరామి రెడ్డి, ఉపాధ్యక్షులు కాశీరావు తదితరులు పాల్గొన్నారు.