దేశంలో అక్రమ ఆయుధాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా ఓ వివాహ వేడుకలో వధువు అక్రమ ఆయుధంతో గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో బయటికి వచ్చింది. హత్రాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేలంపూర్ లోని ఓ గెస్ట్ హౌజ్ లో వివాహ వేడుక జరుగుతుండగా, వధువు సంతోషంతో తుపాకీ తీసుకకొని గాల్లోకి పలుమార్లు కాల్పులు జరిపింది. వధువు కాల్పులు జరుపుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.