ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. చుక్కల భూములను నిషిద్ధ భూముల జాబితా నుండి తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాలు, బాపట్ల జిల్లాలో 7,97 ఎకరాల చుక్కల భూములను నిషిద్ధ భూముల జాబితా నుండి తొలగించారు. ఇప్పటివరకు 15 జిల్లాల్లో మొత్తం 2.06 లక్షల ఎకరాల భూములను నిషిద్ధ జాబితా నుండి తొలగించినట్లు తెలుస్తోంది.