బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామంలో కుక్కకాటుతో చిన్నారి జాహ్నవి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముప్పుల కుంట గ్రామానికి చెందిన చిన్నారి జాహ్నవి 3నెలలు క్రితం కుక్క కాటుకు గురైంది. ఈ విషయం తెలియక మాములు గాయాలు అనుకున్న తల్లిదండ్రులు మూడు నెలల తర్వాత ఆసుపత్రికి వెళ్లగా షాకింగ్ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనంతపురం, కర్నూల్ ప్రాంతాల్లో వైద్యం చేయించగా మరింత విషమంగా మారడంతో బెంగళూరుకు తరలించారు. నిమన్స్ ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిన్నారి మృతితో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.