శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలానికి చెందిన వివాహిత అదృశ్యంపై ఆదివారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగన్న తెలిపారు. ఆమెకు మూడేళ్ల కిందట వివాహమైందని, పిల్లలు కలగకపో వడంతో రెండు నెలల కిందట పుట్టింటికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవ డంతో ఆచూకీ లభించలేదని వివరించారు.