పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలో రామ్మోహన్ రెడ్డీ, శ్రీలతకు చెందిన ఇళ్లలో శనివారం రాత్రి దొంగలు చొరబడి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లినట్లు ఎస్ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. రాత్రి వేళ కుటుంబ సభ్యులు ఇంటిపై నిద్రిస్తున్న విషయాన్ని గమనించిన దొంగలు తాళాలను పగలగోట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. రామ్మోహన్ రెడ్డి ఇంటిలోని బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 2 వేలు నగదు, శ్రీలత ఇంట్లో ఒక తులం బంగారు దోచుకెళ్లినట్లు చెప్పారు. తెల్లవారుజామున తలుపులు తెరచి ఉండడాన్ని చూసి లోపలికి వెళ్లి పరిశీలించారు. దొంగలు చొరబడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.