తెలుగుదేశం పాలనలోనే ముస్లిం సంక్షేమం కొనసాగిందని తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. రాయచోటి మాసాపేటలోని షాహీ మున్వర్ మసీదులో ఆదివారం ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మైనార్టీలకు దుల్హన్ పథకం ద్వారా తెదేపా ప్రభుత్వం ఆర్థికసాయం అందించేందన్నారు. రంజాన్ తోఫా, ఈద్గాలు, మసీదుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేదని చెప్పారు. అనంతరం ప్రసాద్బాబును ముస్లింలు సత్కరించారు. తెదేపా నాయకులు ఇర్షాదఖాన్, మాజీ సర్పంచి దర్బార్ బాషా, మలి గెలబాషా, షఫీ, అల్లాభక్షు, ఇనయతుల్లా, సిద్ధూహుస్సేన్, ఖాదర్ బాషా, మస్తాన్, మాజీ ఎంపీపీ ఖాదర్ బాషా, ఖాదరుస్సేన్, - బాబా, రఫీ, పక్కీరా, అజంతుల్లా తదితరులు పాల్గొన్నారు.